Header Banner

తిరుపతి బ్యాంక్‌లో భారీ కుంభకోణం... ఉద్యోగి చీకటి వ్యవహారం బట్టబయలు! 67 ఖాతాల బంగారం గోల్‌మాల్!

  Sun Feb 23, 2025 14:42        Others

తిరుపతి జిల్లాలో ఒక బ్యాంకులో బంగారు ఖాతాలకు కష్టోడియన్‌గా ఉండాల్సిన ఉద్యోగి.. ఆ గోల్డ్‌ను కాజేసాడు. ఏకంగా 67 ఖాతాలకు సంబంధించిన బంగారాన్ని వాడుకున్నాడు. నాగలాపురం యూనియన్ బ్యాంక్ లో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ మేనేజర్ సూర్య తేజ చేతివాటం బయటపడింది. బ్యాంకులోని గోల్డ్ లోన్ ఖాతాలపై కన్నేసి సొంత అవసరాలు తీర్చుకున్న సూర్య తేజ వ్యవహారంపై కేసు నమోదు అయ్యింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారుపై కన్నేసిన సూర్యతేజ.. మాయగాడి అవతారం ఎత్తాడు. 2024 మే నుంచి 2025 ఫిబ్రవరి 10వ తేదీ వరకు బ్యాంకులో బంగారు నగలపై రుణాలు పొందినవారి బంగారు నగలను తీసి బయట వ్యక్తులకు ఇచ్చి తిరిగి అదే బ్యాంక్‌లో తనఖా పెట్టించాడు. స్నేహితులు, తెలిసిన ఇతరుల పేరుతో అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేసి గోల్డ్ లోన్స్ పొందిన సూర్యతేజ దాదాపు 67 ఖాతాలకు చెందిన గోల్డ్‌ను వాడుకున్నాడు.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


బ్యాంక్ లాకర్‌లోని 37 బ్యాగుల్లోని నగలను మొదటగా తీసుకుని అదే బ్యాంకులో తాకట్టు పెట్టిన సూర్య తేజ రూ 1.31 కోట్లు రుణం పొందాడు. మరో 30 బ్యాగుల్లో ఉన్న నగలను తీసుకెళ్లి నాన్ ఫైనాన్షియల్ ప్రైవేటు కంపెనీలలో తాకట్టు పెట్టాడు. అక్కడ రూ 1.04 కోట్ల సొమ్మును పొందాడు. ఇలా మొత్తం రూ 2.35 కోట్ల మేర ఖాతాదారుల బంగారు నగలను తాకట్టు పెట్టి కాజేసిన బ్యాంక్ డిప్యూటీ హెడ్ సూర్య తేజ నిర్వాకంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు.. తనిఖీ చేయగా ఈ యవ్వారం బయటపడింది. ఈ ఈమేరకు డీజిఎం బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్య తేజ బండారాన్ని బయటపెట్టారు. గోల్డ్ లోన్స్‌కు కస్టోడియన్‌గా ఉన్న సూర్య తేజ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇంటి దొంగగా మారిన సూర్యతేజను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #goldscam #thirupadhi #bankscam #todaynews #flashnews #latestupdate